‘ఇంజనీరింగ్‌’ వెరిఫికేషన్‌ షురూ | 'Engineering' Verification started | Sakshi
Sakshi News home page

‘ఇంజనీరింగ్‌’ వెరిఫికేషన్‌ షురూ

Published Tue, Jun 13 2017 2:19 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

'Engineering' Verification started

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు 21 హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో 1వ ర్యాంకు నుంచి 6 వేల ర్యాంకు వరకు విద్యార్థులను పిలవగా 4,511 మంది వెరిఫికేషన్‌ చేయించుకున్నారు. ఓయూ పరిధిలో 2,975 మంది, ఆంధ్రా వర్సిటీ పరిధిలో 373 మంది, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పరిధిలో 143 మంది, నాన్‌ లోకల్‌ అభ్యర్థులు 20 మంది హాజరయ్యారు. 13న 6001వ ర్యాంకు నుంచి 16 వేల ర్యాం కు వరకు విద్యార్థులు వెరిఫికేషన్‌కు హాజరుకావాలని క్యాంపు అధికారి శ్రీని వాస్‌ తెలిపారు. అలాగే స్పెషల్‌ కేటగిరీ (ఆర్థో వికలాంగులు) వారికి ఈ నెల 13న సాంకేతిక విద్యాభవన్‌లో వెరిఫికేషన్‌ ఉంటుందన్నారు.

40,001వ ర్యాం కు నుంచి చివరి ర్యాంకు వరకు ఈ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు. యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలు, సీట్ల జాబితా ఉన్నత విద్యామండలికి అందలేదు. మంగళ, బుధవారాల్లో వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ సారి సీట్లు భారీగా తగ్గిపోనున్నాయి. ఏఐసీటీఈ గతేడాది 277 కాలేజీల్లో 1,39,468 సీట్లకు అనుమతివ్వగా, ఈసారి 250 కాలేజీల్లో 1,26,315 సీట్లకు అనుమతిచ్చింది. గతేడాది ఏఐసీటీ ఈ అనుమతిచ్చిన సీట్లన్నింటికీ వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. 1.04 లక్షల సీట్లకే ఓకే చెప్పాయి. ఈసారి 85 వేల నుంచి 90 వేల లోపు సీట్లకే అనుబంధ గుర్తింపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఏఐసీటీఈ బీ–ఫార్మసీలోనూ సీట్లకు కోత విధించింది. గతేడాది 144 కాలేజీల్లో 14,460 సీట్లకు అనుమతివ్వగా ఈసారి 137 కాలేజీల్లో 12,931 సీట్లకే అనుమతి ఇచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement