- తెలంగాణలో ప్రవేశాలకు వేరుగానే పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) తేదీలు త్వరలోనే ఖరారు కానున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో వీటిని ప్రకటించే అవకాశాలు న్నాయి. బీటెక్, ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ఎంసెట్‌ను, ఎంబీఏ, ఎంసీఏలో ప్ర వేశాలకు ఐసెట్‌ను, ఎంటెక్, ఎంఫార్మసీలో ప్రవేశాల కోసం పీజీఈసెట్‌ను, న్యాయ విద్యలో ప్రవేశాలకు లాసెట్‌ను, బీఎడ్‌లో ప్రవేశాలకు ఎడ్‌సెట్‌ను, డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఈసెట్‌ను, ఫిజి కల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాల కోసం పీఈసెట్‌ను ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రవేశ పరీక్షల నిర్వహణలో అనుభవం ఉన్న హైదరాబాద్ జేఎన్‌టీ యూ, ఉస్మానియా విశ్వ విద్యాలయం, కాకతీయ విశ్వ విద్యాలయాలకు సెట్స్ నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణకు వేరుగానే సెట్స్! : ఏపీతో సంబంధం లేకుండా తెలంగాణలోని విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసమే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఇంటర్మీడియెట్ పరీక్షలను వేర్వేరుగా నిర్వహించేందుకు షెడ్యూలు జారీ చేసినందున, ఎంసెట్‌ను కూడా వేరుగానే నిర్వహించేందుకు మార్గం సులభం అయిందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు.
దీనిపై ప్రభుత్వ స్థాయిలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. వేరుగానే సెట్స్ నిర్వహించినా, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను పాటిస్తామని ఆయన తెలిపారు. ఏపీ విద్యార్థులు తెలంగాణలోని విద్యా సంస్థల్లో 15 శాతం ఓపెన్ కోటాలో సీట్లు కావాలనుకుంటే తాము నిర్వహించే సెట్స్ రాయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.