Nov 19 2016 2:16 PM | Updated on Sep 5 2018 9:47 PM
నగరంలోని కుత్బుల్లాపూర్ నందనగర్‌లోనో ఓ ఇంట్లో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్ నందనగర్‌లోనో ఓ ఇంట్లో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాలనీలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి దగ్ధమైంది. సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం.