హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలోని ఓ టింబర్ డిపో శనివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అంటుకోగానే.. ఫైరింజన్‌కు ఫోన్ చేశారు. సకాలంలో మూడూ ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పివేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్ది రోజులుగా జనవాసాల్లో ఉన్న ఈ టింబర్ డిపోను తరలించాలని స్థానికులు కోరుతున్నారు.