ఫ్రెండ్లీ సిటీ
అమెరికామ్యారీలాండ్‌లో నవంబర్ 19న జరిగే మిసెస్ ఇండియా కాంటెస్ట్‌కు అర్హత దక్కించుకున్న ఇండోర్ సుందరి... కోమల్ కల్రా పగరాణి శనివారం సిటీకి వచ్చింది. అపోలో ఆసుపత్రిలో, అబిడ్స్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘యుక్త వయసు నుంచి మోడలింగ్‌పై ఉన్న ఆసక్తి తనను గ్లామర్ రంగంలోకి రప్పించింద’ని ఈ సందర్భంగా చెప్పింది. వ్యక్తిగత కారణాల వల్ల 21ఏళ్లకే పెళ్లి చేసుకున్నప్పటికీ తన ఆసక్తిని గమనించిన భర్త తనకెంతో మద్దతుగా నిలుస్తున్నారని, అందువల్లే తాను మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ తదితర టైటిల్స్ సాధించి, ఇప్పుడు మిసెస్ ఇండియాకు సిద్ధమవగలుగుతున్నానంది.
అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరపున పాల్గొనడమే ఓ గొప్పతనమంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకొచ్చే పేరు ప్రతిష్టలను సమాజసేవకు ఉపయోగించాలనేదే తన ఆశయమంది. బాలీవుడ్ ఆఫర్స్ వస్తే.. ఆచితూచి ఎంచుకుంటానంది. హైదరాబాద్‌కు గతంలోనూ వచ్చానంటున్న కోమల్... సిటీలో సన్నిహిత మిత్రులు ఉన్నారని వెల్లడించింది.