క్రేజీ కప్పు సాసర్!
క్రేజీ కప్పు సాసర్!
Published Thu, Jan 21 2016 11:03 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM
కుత్బుల్లా పూర్ నియోజక వర్గంలోని పలు డివిజన్లలలో రెబల్స్ గా ఉన్న అభ్యర్థులంతా ఇప్పుడు 'కప్పు సాసర్' గుర్తు కోసం పోటీ పడుతున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా కప్పు సాసర్ గుర్తు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఈ గుర్తు వస్తే ఇక గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకూ దీని వెనుక కథాకమామీషు ఎంటంటే.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూన శ్రీశైలం గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అప్పట్లో ఆయన గుర్తు కప్పు సాసర్. అప్పటి నుంచి కప్పుసాసర్ గుర్తుకు ఇక్కడ క్రేజ్ ఏర్పడింది. స్వతంత్రులుగా పోటీలో నిలుస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులు కూడా కప్పుసాసర్ గుర్తు వస్తే ఇక తమదే విజయం అని భావిస్తున్నారు. మరి ఎవరికి ఈ లక్కు దక్కేనో చూడాలి.
- కుత్బల్లాపూర్
Advertisement
Advertisement