పభుత్వానికి సహకరిద్దాం: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు, అధికారులు అన్నివిధాలా సహకరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని, అందుకు కేసీఆర్ ప్రణాళికలను రూపొందిస్తున్నారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ శ్రీనివాస్‌గౌడ్‌ను ఘనంగా సన్మానించింది.
ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో రవాణా శాఖ అధికారులు, ఉద్యోగులదే కీలక పాత్ర అని కొనియాడారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంతో పాటు, కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టబోతున్న దృష్ట్యా అందరం కష్టపడి పనిచేద్దామని, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయవ ద్దని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, గౌరవాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.