డబ్బులివ్వలేదని దూషించాడు: పోసాని
అమీర్‌పేట: తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడనీ, ఫోన్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడని సినీ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి శుక్రవారం ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ వహిదుద్దీన్ కథనం ప్రకారం... సినీ పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసిన లక్ష్మీనారాయణ అలియాస్ నరేష్ డబ్బులు కావాలని పోసానిని ఫోన్‌లో అడిగాడు. మీరెవరో తనకు తెలియదనీ, ఫోన్‌చేసి డబ్బులు అడగటం ఏమిటని పోసాని అతడిని ప్రశ్నించాడు.
తాను కూడా సినీ పరిశ్రమలో పని చేస్తున్నానని, అత్యవసరంగా డబ్బులు కావాలని నరేష్ చెప్పగా తరువాత మాట్లాడతానని పోసాని ఫోన్ పెట్టేశాడు. వినిపించుకోని నరేష్ పోసానికి ఫోన్‌చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. నీ అంతు చూస్తానని పోసాని ఫోన్‌కు మెసేజ్‌లు పంపాడు. ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్న పోసాని సాయంత్రం ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా... నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.