సర్కార్‌కు ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకుంటే రూ.15 వేలు ప్రోత్సాహకం ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో అందుకోసం 2017–18 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.650 కోట్లు కేటాయించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపా దించింది. అమ్మఒడి పద్దు కింద కొత్తగా ఈ ప్రతిపాదన చేసింది. మొత్తంగా 2017–18 బడ్జెట్‌లో రూ.9,306 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించి నట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 834 కోట్లు
ప్రస్తుత బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి రూ.484 కోట్లు కేటాయించగా... వచ్చే బడ్జెట్లో రూ.740 కోట్లు కేటాయించాలని కోరారు. ఇక ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి కొత్తగా రూ.834 కోట్లు కేటాయించాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. హైదరాబాద్‌లో నిర్మించబోయే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం రూ.200 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.
రూ.9,306 కోట్లు కేటాయించండి
Published Sat, Feb 4 2017 2:40 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement