‘అమ్మ ఒడి’ ఏర్పాట్లు పూర్తి చేయండి
లక్ష్మారెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. జూన్ 2 కల్లా గర్భిణిల పూర్తి సమాచారం సేకరణ, కంప్యూటరీకరణ కచ్చితంగా జరగా లని సూచించారు. కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో జరుగుతున్న హెల్త్ ఎడ్యుకేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి మంగళవారం సందర్శించారు. ఆయన మా ట్లాడుతూ... అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న గర్భిణిల వివరాలను నమోదు చేయాలని, చిన్న పొరపాట్లకు కూడా తావీ యవద్దని సూచించారు. పొరపాట్లు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరులో కేసీఆర్ బేబీ కిట్లు
కేసీఆర్ బేబీ కిట్‌ను ఈ నెలాఖ రులో ప్రవేశపెడుతున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. రెడ్‌హిల్స్ లోని నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని, పరిశుభ్రమైన వాతావరణంలో పెరగాలనే లక్ష్యంతో కిట్‌ను అందజేస్తున్నట్లు వివరించారు. తల్లీ బిడ్డల సంరక్షణ కోసం ఆడ శిశువుకు రూ.13 వేలు, మగ శిశువుకు రూ.12 వేల చొప్పున పలు విడతలుగా అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రోత్సాహకాలు నేరుగా బాలింత ఖాతాలోకి చేరేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిం చామని చెప్పారు. హైరిస్క్ కేసులే మరణాలకు దారితీస్తున్నాయని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా లక్ష్మారెడ్డి చెప్పారు. జాతీయ స్థాయిలో జరిగే మరణాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ అన్నారు.