హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడం, అల్పపీడన ప్రభావంతో మంగళవారం నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్, ఆర్‌టిసి క్రాస్ రోడ్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులపై భారీగా వర్షపునీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.
సాయంత్రం విద్యాసంస్థలు, కార్యాలయాల నుంచి బయటికి వచ్చిన ఉద్యోగులు రెండుగంటలు ఆలస్యంగా ఇళ్లు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ సరిగా లేక రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.