'తొక్కిసలాట'పై సుమోటోగా స్పందించిన హైకోర్టు
హైదరాబాద్: పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై హైకోర్టు తనకు తానుగా స్పందించింది. దీనిపై విచారణను సుమోటోగా స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తొక్కిసలాట ఎలా జరిగింది, ప్రమాదానికి కారకులెవరు, సహాయచర్యలు ఏం తీసుకున్నారని నోటీసుల్లో ప్రశ్నించింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి గడువు విధించింది.
గోదావరి పుష్కరాలు ప్రారంభం సందర్భంగా జూలై 14న రాజమండ్రి పుష్కర ఘాటులో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి.