బడ్జెట్ రూ.2600 కోట్లు
సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరపాలక అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) 2017–18 వార్షిక సంవత్సరానికి రూ.2600 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కమిషనర్ చిరంజీవులు అధ్యక్షతన గురువారం సంస్థ ప్రధాన కార్యాలయంలో 21వ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. అంతేకాకుండా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన కోసం 50 మంది జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్లును తీసుకోవాలని నిర్ణయించింది.కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గుర్తిం చింది. టీఎస్‌ఎంఐడీసీ తీరును తప్పుబట్టింది.
అధిక ధరకు కొనుగోళ్లు..
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ఏడాది క్రితం మెస్సర్స్ సీజన్స్ హెల్త్‌కేర్ లిమిటెడ్ కంపెనీ నుంచి 50 వెంటిలేటర్లు (బెల్లావిస్టా 1000) కొనుగోలు చేసింది. యూనిట్ ధర రూ.11.01 లక్షలుగా నిర్ధారించింది. దీని మార్కెట్ ధర రూ.6.50 లక్షలు ఉండగా, టీఎస్‌ఎంఐడీసీ అధికారులు అధిక ధరకు కొనుగో లు చేసినట్లు ‘కాగ్’ గుర్తించింది. మార్కెట్ ధరను, టెండర్ పత్రాలను పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలుచేశారని, ప్రభుత్వం పెద్ద మొత్తంలో నష్టపోయిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
ఇండెంట్ పంపకుండానే సరఫరా
ఏ రోగికి ఏ మందు అవసరమో.. ఏ వైద్య పరీక్ష చేయాలనే అంశంపై సంబంధిత వైద్యులకు అవగాహన ఉంటుంది. ఆమేరకు వాటిని సరఫరా చేయాల్సిందిగా ఆస్పత్రులు టీఎస్‌ఎండీసీకి ఇండెంట్ పంపుతాయి. కానీ టీఎస్‌ఎంఐడీసీ అధికారులు వీటితో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు ముందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేశారు. వాటిని వదిలించుకునేందుకు అడగకపోయినా, అవసరం లేకున్నా ఆస్పత్రులకు అంటగట్టారు. నిలోఫర్ ఆస్పత్రికి రూ.18.14 లక్షల విలువ చేసే ‘ఎక్సరే మెషిన్ 500 ఎంఏ’ను 2013 మార్చిలో సరఫరా చేసింది. నాలుగేళ్లు అవుతున్నా దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ పరికరానికి అవసరమైన విద్యుత్ సరఫరా లేనందువల్లే వినియోగించలేక పోయినట్లు తేలింది. ఆస్పత్రి సూపరింటిండెంట్ కానీ ఇతర అధికారులు కానీ ఈ పరికరం కావాలని అడగలేదు. అధికారికంగా ఎలాంటి ఇండెంట్ పంపలేదు.
కానీ మెషన్ మాత్రం సరఫరా అయింది. ఇదిలా ఉంటే.. ఆస్పత్రిలో రెండు ఎక్సరే మిషన్లు ఉండగా వీటిలో ఒకటి ఇప్పటికే పాడైపోయింది. దీన్ని రిపేరు చేయకపోగా, మరోదాన్ని అందుబాటులోకి తేలేదు. డెంగీ రోగుల చికిత్స కోసం 2014 అక్టోబర్‌లో రూ.7.50 కోట్లతో 12 బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్లను కొనుకోగులకు పాలనాపరమైన అనుమతి పొంది, రూ.32.30 లక్షల విలువ చేసే ఒక యూనిట్‌ను 2016 మార్చిలో నిలోఫర్‌కు అందజేసింది. దీన్ని ఇప్పటి వరకు వినియోగంలోకి తేలేదు. నిజానికి దీన్ని తాండూరు జిల్లా ఆస్పత్రి కోసం టీవీవీపీ కమిషనర్ అభ్యర్థన మేరకు కొనుగోలు చేశారు. అక్కడి అధికారులు తిరస్కరించడంతో నిలోఫర్‌కు అంటగట్టారు. పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి 2009లో రూ.13.15 లక్షల విలువచేసే ఎండోస్కోపిక్ వీడియో రికార్డింగ్ సిస్టం సరఫరా చేసింది. నాటి నుంచి ఇది నిరుపయోగంగానే ఉంది. ఇండెంట్ పంపక పోయినా దీన్ని సరఫరా చేశారు.
అవసరం లేకుండా అడ్డుగోలు కొనుగోళ్ల వ్యవహారం అలా ఉంచితే.. అవసరమున్న అత్యవసర వైద్య పరికరాలను వినియోగంలోకి తేవడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో రోగుల అవసరాల కోసం ‘ఎనస్తీషియా వర్క్ స్టేషన్’ను 2014 ఏప్రిల్‌లో రూ.2.91 కోట్లతో కొనుగోలుచేసింది. దీన్ని 2015 మార్చిలో అమర్చింది. ఉస్మానియా ఆస్పత్రికి 2014 మేలో రూ.1.24 కోట్ల విలువ చేసే డిజిటల్ మామోగ్రఫీ యూనిట్‌ను కొనుగోలు చేసి, 2015 ఫిబ్రవరిలో అమర్చింది. అయితే సరఫరా సంస్థ ఈ పరికరాన్ని అమర్చి, ప్రయోగాత్మకంగా నడిపి చూపించడం, ఆస్పత్రికి అప్పగించడం వంటి పనులన్నీ 2015 ఫిబ్రవరి నాటికే పూర్తి చేసినట్లు టీఎస్‌ఎంఐడీసీ ‘కాగ్’కు నివేదించింది.
వాస్తవానికి ఆయా ఆస్పత్రుల అధికారులు ‘కాగ్’కు ఇచ్చిన నివేదికలో మాత్రం తొమ్మిది నెలలు అనంతరం వినియోగంలోకి వచ్చినట్టు పేర్కొన్నారు. రూ.15.49 లక్షలు విలువచేసే ఆల్ట్రా సౌండ్ కలర్ డాప్లర్ సిస్టంతో సహా.. రూ.13.50 లక్షల విలువైన ‘డీఫైబ్రిలేటర్’ వైద్య పరికరం కూడా తొమ్మిది నెలలు నిరూపయోగంగా ఉన్నాయి.నిబంధనల ప్రకారం ఆర్డర్ ఇచ్చిన 60 రోజుల్లోనే యంత్రాలు కొనుగోలు చేసి, అందుబాటులోకి తీసుకురావాలి. ఆలస్యం జరిగితే టెండర్‌ను రద్దు చేయడంతో పాటు ఈఎండీని కూడా జప్తుచేసే అధికారం ఉంది. కానీ ప్రభుత్వం ఉదాసీనతతో చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా టీఎస్‌ఎంఐడీసీ ఆడింది ఆటగా సాగుతోంది.