కాల్చింది నేను కాదు.. సాయికుమార్!
హిమాయత్‌నగర్ ప్రాంతంలో వైద్యుల మధ్య కాల్పుల ఘటన క్రైం థ్రిల్లర్ సినిమా ట్విస్టులను తలపిస్తోంది. ఈ ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు డాక్టర్ ఉదయ్ మీద కాల్పులు జరిపింది తాను కాదని, సాయికుమార్ కాల్చడంతో తాను భయపడి అక్కడి నుంచి పారిపోయానని ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్ తన సూసైడ్ నోట్‌లో రాశారు.
భార్యా పిల్లలు తనను క్షమించాలని, గ్లోరియల్ ఆస్పత్రి వివాదంలో కావాలనే తనను ఇరికించారని అన్నారు. తన ఆత్మహత్యకు మరో ఇద్దరు వైద్యులు కారణమని ఆయన రాశారు. కాగా, నక్కలపల్లిలోని ఫామ్‌హౌస్‌లో రివాల్వర్‌తో పాటు నాలుగు రౌండ్ల బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.