స్పీకర్లు పాలకపార్టీల తొత్తులుగా మారితే ఎలా?: వామపక్షాల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా పాలకపక్షాలే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం విస్మయం కలిగిస్తోందని వామపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల్ని ఉపయోగించుకుని పాలక పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వ్యాపారంగా మారిపోతున్నాయనే దానికి ఇటీవలి పరిణామాలే సాక్ష్యమని ఆవేదన వ్యక్తం చేశాయి.
అధికార సుస్థిరతకే తంటాలు:సీపీఐ
తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ వైపు ఫిరాయించినప్పుడు అనైతికమని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే పని చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.
స్పీకర్లా, పాలకపక్ష మద్దతుదార్లా?: సీపీఎం
ఎవరైనా ప్రజాప్రతినిధి తాను గెలిచిన పార్టీ నుంచి తప్పుకుని వేరే పార్టీలో చేరినప్పుడు ఆ వ్యక్తి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిన స్పీకర్లు సైతం చట్టబద్ధంగా వ్యవహరించడం లేదని, అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.స్వతంత్రంగా వ్యవహరించాల్సిన స్పీకర్లు పాలకపార్టీ లకు తొత్తులుగా మారడం, వాటి ప్రయోజనాలు కాపాడడం దురదృష్టకరమన్నారు.
అభివృద్ధి ముసుగులో ఫిరాయింపులా?
Published Mon, Feb 22 2016 2:26 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement