సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రాసెస్ చేస్తున్న కంప్యూటర్ ఏజెన్సీ అలసత్వం కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. వాస్తవానికి ఈ నెల 20న ఫలి తాలు విడుదల కావాలి. కానీ దానికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తి చేయక వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రస్తుతం ఒప్పందం చేసుకున్న సంస్థతో కాకుండా గతంలో పని చేసిన సంస్థతో అనధికారికంగా పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. దీంతో సప్లిమెం టరీ ఫలితాలు ఈనెల 22 లేదా 23న విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల కోసం 5 లక్షల విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
25న ఓయూసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఓయూసెట్-2016 ఫలితాలు జూన్ 25న విడుదలకానున్నాయి. తొలిసారిగా విడుదల చేసిన ప్రాథమిక కీలో 42 మంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా, వాటిని ఆయా విభాగాలకు పంపినట్లు ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఫైనల్ కీ విడుదల తర్వాత, ఫలితాల్ని ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.