‘కొఠారి’ స్ఫూర్తితో విద్యకు కొత్త శోభ | Education to the new Charm | Sakshi
Sakshi News home page

‘కొఠారి’ స్ఫూర్తితో విద్యకు కొత్త శోభ

Published Sat, Sep 27 2014 11:14 PM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

‘కొఠారి’ స్ఫూర్తితో విద్యకు కొత్త శోభ - Sakshi

‘కొఠారి’ స్ఫూర్తితో విద్యకు కొత్త శోభ

భారత ప్రభుత్వం ఇక్కడి విద్యావ్యవస్థను పునర్ నిర్మించడానికి కావలసిన సిఫారసులను అందించేందుకు కొఠారి కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ ఓ నివేదికను అందించింది. ఇతర దేశాలు కూడా దానినే మార్గదర్శకంగా భావిస్తాయి. ఆ మేరకే జూనియర్ కాలేజీల వ్యవస్థ ఏర్పడింది.
 
 
 విద్యారంగంలో మార్పులు తేవడం మంచిదే. మారుతున్న సమాజాన్ని, కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మార్పులు తీసుకు రావాలి.  ప్రాథమిక, మాధ్యమిక విద్యారంగంలో మనం తీసు కువచ్చే మార్పులు, సంస్కరణలే ఉన్నత విద్య పటిష్టతను నిర్దేశి స్తాయి. ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు తీసుకు వస్తామని చెప్పింది. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులే మొత్తం ఉన్నత విద్యారంగాన్ని తీర్చిదిద్దగలగాలి. ఆ రక మైన పరిస్థితి నెలకొల్పలేకపోతే ఆ తీసుకు వచ్చే మార్పులు ఇంటర్ విద్యకు శాపంగా మారతాయి.

20వ శతాబ్దం ద్వితీయార్థంలో ప్రపం చంలో ముఖ్యంగా యూరప్ అమెరికాలలో చాలా మార్పులు వచ్చాయి. పారిశ్రామిక విప్లవం వలన ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగుపడటం,  ఉపాధి అవకాశాలు పెర గడం, టెక్నాలజీకి పునాది ఏర్పడటం జరిగింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇక్కడి విద్యా వ్యవస్థను పునర్ నిర్మించడా నికి కావలసిన సిఫారసులను అందించేందుకు కొఠారి కమిష న్‌ను నియమించింది. ఆ కమిషన్ దేశంలోనే కాకుండా సోవి యెట్ యూనియన్, యూరప్, బ్రిటన్, అమెరికా దేశాలలో పర్యటిం చింది. ఇక్కడి ఉపాధ్యాయ సంఘాలను, విద్యావేత్త లను, సామాజిక కార్యకర్తలను సంప్రదించి ఉదాత్తమైన నివేది కను అందించింది. దాని మీద రెండేళ్లు చర్చలు జరిగాయి. ఆ నివేదికలోని సలహాలను కొన్ని సవరణలతో దేశంలో అమలు చేశారు. ఇతర దేశాలు కూడా ఆ నివేదికనే ఇప్పటికీ మార్గద ర్శకంగా భావిస్తాయి. ఆ రిపోర్టు ప్రకారమే మన రాష్ట్రంలో జూనియర్ కాలేజీల వ్యవస్థ ఏర్పడింది. ఇలాంటి ప్రయోగం ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. 10వ తరగతి వరకు సెకండరీ స్థాయి అని, దాని లక్ష్యం విద్యార్థికి సమాచారంతో సహా నైపుణ్యం ఇచ్చేందుకు మ్యాథమ్యాటిక్స్, సైన్స్ సాంఘికశాస్త్రాల నైపు ణ్యాలు కలిగించాలని సూచించారు. 10వ తరగతి వరకు ఏర్ప డిన నైపుణ్యాలు ఉన్నతమైన విలువలను తీసుకురావాలని దేశంలో వర్క్ ఫోర్స్‌ను తయారు చేసేందుకు పారిశ్రామిక విప్ల వ ఫలితాల కోణం నుంచి జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేశా రు. దేశంలో నైపుణ్యం గల మానవ వనరులను సృష్టించేందుకు ఇంటర్మీడియట్ వ్యవస్థను పకడ్బందీగా తీర్చిదిద్దారు. మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు అనుసరణీయంగా మారింది. ఆనాటి రాష్ర్ట విద్యాశాఖ మంత్రి పీవీ నరసింహారావు ఇంటర్ విద్య పటిష్ట తకు చర్యలు తీసుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1969లో ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పడిన తరువాత ఈ విద్యను ఏ రకంగా నిర్వహించాలో దూరదృష్టితో చర్చించారు. ఈ నేపథ్యంలోనే 1979 నుంచి ఇం టర్ పరీక్షల నిర్వహణలో మార్పులు తెచ్చారు. ఏ సంవత్స రానికి ఆ సంవత్సరం పరీక్షలు నిర్వహించే విధానం తెచ్చారు. ఈ విధానం వలన మంచి ఫలితాలు వచ్చాయి.
 
ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలకు ఒకేసారి పరీక్షలు నిర్వహించే పద్ధతి సరైంది కాదు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోనే ఎంసెట్ పరీక్షకు సంబంధించిన అనేక విషయాలను ఈ పరీక్షలో రాసేస్తారు. ఒకేసారి డ్రిగీ పరీక్ష లు రాసే మూడేళ్ల విధానానికి స్వస్తి పలికి, డిగ్రీనే ఇయర్‌వైజ్ స్కీముగా చేశారు. డిగ్రీ, పీజీలలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. కాబట్టి ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా అవసరమైతే సెమిస్టర్ విధానం తేవడం మంచిది. రెండేళ్లకొకేసారి పరీక్ష అన డం విద్యార్థిపై బరువు మోపడమే.దేశ దేశాలు కంప్యూటర్ ద్వారా పరీక్షలు రాసే దిశలో  ముందుకు సాగుతున్నాయి. ఈ దశలో రెండేళ్లకొకేసారి పరీక్షలు నిర్వహించడం అశాస్త్రీయమే. ఈనాటి పోటీ పరీక్షలన్నీ ఇంటర్ మొదటి సంవత్సరాన్ని పునా దిగా చేసుకునే వస్తున్నాయి.  పోటీ పరీక్షల్లో ప్రాబ్లమ్స్ ఇచ్చి పరి ష్కరించమంటున్నారు. దానికి అనుగుణంగా ఇంటర్ విద్యా రంగాన్ని మార్చుకోవాల్సి ఉంది. మానవీయ శాస్త్రాలను బోధిం చేటప్పుడు కొన్ని సంఘటనలను తీసుకొని పాఠాన్ని చెప్పాలి. ఆ సంఘటనలు ఆధారంగా చేసుకొని ఆ సమస్యలకు పరిష్కార మార్గం కనుగొనాలని విద్యార్థికి చెప్పాలి. ఎవరైతే సమస్యలను పరిష్కరించగలుగుతారో వారే చదువుకున్నవారవుతారు. సమ స్యలకు సమాచారం మాత్రమే ఉంటే అది వల్లెవేతల, బట్టీ పట్టే చదువవుతుంది. దీనివల్ల విద్యార్థి మెదడులో కావాల్సినంత సమాచారం ఉంటుంది. కానీ అందుకు సంబంధించిన పరిష్కా రాల మార్గం కోసం ఆలోచనలు దొరకవు. ఇంటర్ విద్యలో మా ర్పులు చేసేటప్పుడు పాలకులు అన్ని కోణాల నుంచి ఆలోచిం చాలి. కొఠారి కమిషన్ ఎంత శ్రమకోర్చి నివేదికలందించిందో దానిని పునశ్చరణ చేసుకొని ముందుకు సాగటం మంచిది.

 (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త)  - చుక్కా రామయ్య
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement