నాగోలులో ప్రైవేట్ పార్టీకి వెళ్లి వస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రోడ్డు పక్కన ఉన్న అపరిశుభ్రతను చూసి కారు ఆపి కిందికి దిగారు.
హైదరాబాద్: నాగోలులో ప్రైవేట్ పార్టీకి వెళ్లి వస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రోడ్డు పక్కన ఉన్న అపరిశుభ్రతను చూసి కారు ఆపి కిందికి దిగారు. అనంతరం స్థానిక మహిళతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఆసక్తికరమైన సంఘటన ఆదివారం ఎల్‌బీనగర్ సమీపంలోని నాగోల్‌లో జరిగింది. కాగా, సీఎంతో మాట్లాడిన విజయలక్ష్మి అనే మహిళ ఈ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పింది. దీంతో స్పందించిన సీఎం పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్‌ను వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో నాగోల్‌లోని మమతానగర్ కాలనీకి చేరుకున్న సీపీ సీవీ. ఆనంద్ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
(నాగోలు)