సింగరేణి కార్మికులకు బంపర్ ఆఫర్
హైదరాబాద్: సింగరేణి కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సింగరేణి లాభాల్లో 23 శాతం కార్మికులకు చెల్లించాలని గురువారం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఒక్కో కార్మికుడికి సగటున 43 వేల రూపాయలు అందనున్నాయి. దీంతోపాటు 1998లో చంద్రబాబు ప్రభుత్వం రద్దుచేసిన డిపెండెంట్ ఉద్యోగాల నియామకాలను తిరిగి పునరుద్ధరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. వీఆర్ఎస్ ద్వారా లబ్ది పొందని వారికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
అత్యధిక లాభాలు గడించిన సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు అభినందనలు తెలిపిన సీఎం.. సరిహద్దుల్లో సైనికులు, గనికార్మికులు సమానమే అని అన్నారు. తెలంగాణ ప్రజలకు పాలన చేతకాదని విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించేలా తెలంగాణ పాలన కొనసాగుతుందని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు.