తెలంగాణ రాష్ట్ర సాగునీటీ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాగునీటీ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన తమ్మిడిహట్టి, కాళేశ్వరం బ్యారేజీలపై చర్చించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్.. తమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సహకరించాల్సిందిగా కోరారు. ప్రాజెక్టుల రీడిజైన్తో సహా పలు అంశాలపై కేసీఆర్ అధికారులతో చర్చించారు. నివేదికలు పూర్తి చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.