గంటలో 293 పజిల్స్! | kesava kirupa speed solving cubic puzzle | Sakshi
Sakshi News home page

గంటలో 293 పజిల్స్!

Published Tue, Aug 4 2015 10:03 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

గంటలో 293 పజిల్స్!

గంటలో 293 పజిల్స్!

సాక్షి, హైదరాబాద్: మనలో చాలా మంది క్యూబ్ ఫజిల్‌ని పూర్తి చేయడమే గొప్పగా భావిస్తాం. దాన్ని పూర్తిచేయడానికి కిందా మీదా పడుతుంటాం. అయినా దాన్ని పూర్తిచేస్తామనే గ్యారెంటీ లేదు. అయితే చెన్నైకి చెందిన కేశవ కిరుప అనే పదిహేనేళ్ల బాలుడు మాత్రం అవలీలగా కేవలం గంటలో 293 క్యూబ్ పజిల్స్‌ను పూర్తి చేశాడు.

గతంలో ఫ్రాన్స్ కు చెందిన ఓ వ్యక్తి గంటలో 210 పూర్తి చేసి రికార్డు సృష్టించగా ఇప్పుడు దాన్ని మన కుర్రాడు తిరగరాసి... గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించడం పట్ల కేశవ ఆనందం వ్యక్తం చేశాడు.

దేశం తరఫున ఇలాంటి అరుదైన రికార్డు చేసినందుకు గర్వంగా ఉందన్నాడు. పజిల్స్‌ను పరిష్కరించడానికి సాధన చేస్తున్నప్పుడు మొదట 289 మాత్రమే పూర్తిచేయగలిగానని, క్రమంగా బాగా ప్రాక్టిస్ చేసి గంటలో 293 పూర్తి చేయగలిగానని కేశవ వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement