
ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలి: కోదండరామ్
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతి ఇచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీజేఏసీ కన్వీనర్ కోదండరామ్ తెలిపారు. శుక్రవారం కోదండరామ్ హైదరాబాద్లో మాట్లాడుతూ... తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో విజ్ఞతతో వ్యవహరించి ఓటు వేయాలని ఆయన ఓటర్లకు హితవు పలికారు. తెలంగాణ కోసం పోరాడింది ఎవరో .... అలాగే తెలంగాణ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించింది ఎవరో ప్రజలందరికి తెలుసునని కోదండరామ్ వెల్లడించారు. ప్రజలు చాలా వివేకవంతులని ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసునని కోదండరామ్ అన్నారు.