పార్టీల బలహీనానికే కొత్త జిల్లాలు: ఎల్.రమణ | L.ramana comment on new district formation | Sakshi
Sakshi News home page

పార్టీల బలహీనానికే కొత్త జిల్లాలు: ఎల్.రమణ

Published Fri, Oct 7 2016 2:29 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

పార్టీల బలహీనానికే కొత్త జిల్లాలు: ఎల్.రమణ - Sakshi

పార్టీల బలహీనానికే కొత్త జిల్లాలు: ఎల్.రమణ

సాక్షి, హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న తీరుతో వాటికున్న పవిత్రత పోతోందని టీటీడీపీ నేత ఎల్.రమణ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలను బలహీనపరిచేందుకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర భూసేకరణ చట్టం-2013 అమలు చేయకపోవడం, ఎంసెట్ లీకేజీతో విద్యార్థులకు నష్టం, కరువు వల్ల రైతాంగం కడగండ్లు వంటి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఈ ఆలోచన చేశారన్నారు.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించిన కరీంనగర్ జిల్లాలో ఇతర జిల్లాల్లోని 8 ప్రాంతాలను కలిపారన్నారు. తూతూ మంత్రంగా, బలహీన వర్గాలను దెబ్బతీసేలా జిల్లాల విభజన ఉందని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పరిశ్రమలకు కేంద్రమిచ్చే రాయితీలను ఏ జిల్లాలకు కేటాయిస్తారని టీడీపీ నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో రైలు పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టుపై ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement