హైదరాబాద్: భార్య వేధింపులకు పాల్పడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో.. మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ వ్యక్తి తన భార్య వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.