స్కైవేల నిర్మాణంపై నార్వే ఆసక్తి
హైదరాబాద్: పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన నార్వే బృందంతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... స్కైవేల నిర్మాణం, మూసీ నది ప్రక్షాళనతో పాటు చెరువుల పునరుద్ధరణపై నార్వే బృందం ఆసక్తి చూపిందని అన్నారు. తాజాగా వాల్మార్ట్తో తెలంగాణ ప్రభుత్వం మూడు ఒప్పందాలు చేసుకుందని తెలిపారు.
మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ను మంగళవారం ఐటీ పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. నగరాభివృద్ధికి చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ భాగస్వామ్యం అందిస్తామని ఆయనకు ఐటీ ప్రముఖులు హామీ ఇచ్చారు. మరో మంత్రి జగదీష్ రెడ్డికి సీఎం కేసీఆర్ అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. విద్యుత్ శాఖతో పాటు ఎస్సీ కార్పొరేషన్ను ఆయనకు కేటాయిస్తూ మంగళవారం జీవో చేశారు.