హైదరాబాద్ : నగరంలో జరుగుతున్న మెట్రో పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. గురువారం అధికారులతో సమావేశమైన ఆయన పలు విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కోల్కతాలో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదం నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మలక్ పేట వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.