శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే సస్పెండ్ చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు.
హైదరాబాద్ : శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే సస్పెండ్ చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అవమానపరుస్తుంటే చూస్తూ ఊరుకున్న స్పీకర్, గవర్నర్లను గౌరవించాలా అని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలని, సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయాలని తెలంగాణ శాసనసభ రూల్స్ కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.