
ఎంఎంటీఎస్ రైళ్ల పాక్షిక రద్దు
హైదరాబాద్ : వివిధ రూట్లలో నడుస్తున్న 6 ఎంఎంటీఎస్ సర్వీసులను పాక్షికంగా రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. మే 1 నుంచి జూలై 31 వరకు ఈ పాక్షిక రద్దు కొనసాగనుంది. లింగంపల్లి-ఫలక్‌నుమా, సికింద్రాబాద్-ఫలక్‌నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ సర్వీసులను సికింద్రాబాద్-ఫలక్‌నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-సికింద్రాబాద్ మధ్య రద్దు చేస్తారు.
ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే సమయంలో 6 సర్వీసులను పాక్షికంగా రద్దు చేయడం వల్ల, రద్దీ అధికంగా ఉండే సమయాల్లో సర్వీసులు పెంచేందుకు ఏ మేరకు అవకాశం లభించగలదనే అంశాన్ని తెలుసుకొనేందుకు 3 నెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు.