
మోదీతో పోల్చుకునేంత మొనగాడు కాదు
ప్రధాని మోదీతో పోల్చుకునేంత మొనగాడు కేసీఆర్ కాదని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్‌పై నాగం ఫైర్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీతో పోల్చుకునేంత మొనగాడు కేసీఆర్ కాదని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. మోదీలా తనది కూడా అవినీతిరహిత ప్రభుత్వమని చెప్పుకునే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతే అడ్డంకిగా మారిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలు కేంద్రం వద్ద ఉన్నాయన్నారు. మిషన్ భగీరథలో అవినీతిపై సీబీఐ విచా రణకు కేసీఆర్ ఆదేశించాలన్నారు. పథకంలోని పలు అంశాల వివరాతో సీఎంకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశా రు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పంపింగ్ స్టేషన్ల ఎవాల్యూవేషన్, మేనేజ్‌మెంట్ ప్రతిపాదనల పేరిట భారీ కుంభకోణం జరిగిందన్నారు.