‘రైతులను ఇబ్బంది పెట్టడంలోనూ టాపే’
సాక్షి, హైదరాబాద్: అధిక ఆదాయం వచ్చిన రాష్ట్రంగా అగ్రభాగాన ఉన్నప్పటికీ రైతుల రుణమాఫీ పూర్తిస్థాయిలో ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి ప్రశ్నించారు. మూడో విడత రుణమాఫీ కింద రూ.4,023 కోట్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని శనివారం డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టడంలోనూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అగ్రభాగాన ఉందన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారని నిలదీశారు. రైతుల సమస్యలకు టీడీపీ, బీజేపీ కారణమని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెబుతున్నారని, బీజేపీ ఎలా కారణమో చెప్పాలన్నారు.