
క్లీన్‌చిట్‌పై అనుమానాలు: నాగం
సాక్షి, హైదరాబాద్: భూకుంభకోణాలపై ప్రభుత్వపరంగా ఎలాంటి నివేదికలు ఇవ్వ కుండానే ఒక్క గజం కబ్జా కాలేదని సీఎం చేసిన ప్రకటన అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన ఆధారంగానే మియాపూర్ భూ బకాసురులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలను, తన ఆత్మగా ఉన్న వ్యక్తిని కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు.