‘హాక్–ఐ’ యాప్‌కు జాతీయ అవార్డు
- కేంద్రమంత్రి చేతుల మీదుగా అందుకున్న హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి
- మొబైల్ టెక్నాలజీ విభాగంలో దేశవ్యాప్తంగా 261 ఎంట్రీలు
- వాటిలో హాక్–ఐని వరించిన పురస్కారం
సాక్షి, హైదరాబాద్: బాధితులకు సత్వర సాయం అందించడంతోపాటు ప్రజలు– పోలీసుల మధ్య సమాచార మార్పిడికి వేదికగా ఉండేలా హైదరాబాద్ పోలీసులు రూపొందించిన మొబైల్ యాప్ ‘హాక్–ఐ’ జాతీయస్థాయి అవార్డు గెల్చుకుంది. మంగళవారం విశాఖప ట్నంలో జరిగిన ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా సదస్సులో కేంద్ర మంత్రి పీపీ చౌదరి చేతుల మీదుగా నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. కేంద్రం అధీనంలోని పాలనా సంస్కరణలు, ప్రజా ఇబ్బందుల పరిష్కార విభాగం 2016కు సంబంధించి జాతీయ స్థాయిలో ఎంట్రీలు ఆహ్వానించింది.
‘ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ మొబైల్ టెక్నాలజీ’ అనే అంశంపై 12 విభాగాల నుంచి 261 ఎంట్రీలు వచ్చాయి. 2014 డిసెంబర్ 31 నుంచి అందుబాటులోకి వచ్చిన ‘హాక్–ఐ’ సేవలు, నిర్వహణ తదితరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ‘నేషనల్ ఈ– గవర్నెన్స్ గోల్డ్’ అవార్డును ప్రకటించింది. కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఎస్పీ రమేష్ రెడ్డి, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి మంగళ వారం ఈ అవార్డు అందుకున్నారు. పురస్కా రం కింద ప్రశంసాపత్రం, జ్ఞాపికతోపాటు రూ. 2 లక్షల నగదు పురస్కారం అందించారు. హైదరాబాద్ సిటీ పోలీసులు రూపొందించి, వినియోగిస్తున్న మొబైల్ యాప్స్‌కు గతేడాది నాలుగు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.
‘హాక్–ఐ’ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ టీమ్‌ను పోలీసు కమిషనర్ అభినందించారు. జాతీయ స్థాయి అవార్డు గెల్చుకున్న సిటీ పోలీసు విభాగాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ అభినందించారు. ఎం. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘ఈ అవార్డు ను నగర ప్రజలకు, తెలంగాణ పోలీసులకు అంకితం చేస్తున్నాం. సిటీ కాప్స్ వినియోగి స్తున్న మొబైల్ ఆధారిత పరిజ్ఞానం నేరాల నిరోధం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణ తో పాటు నేరగాళ్లపై నిఘాకు ఉపకరిస్తోంది. దీంతో హైదరాబాద్ సేఫ్ సిటీ వైపు అడుగులు వేస్తోంది’’ అని అన్నారు. ‘హాక్–ఐ’ యాప్‌కు గత ఏడాది మార్చిలో ‘సోషల్ మీడియా ఫర్ ఎంపవర్‌మెంట్–2016’ అంతర్జాతీయ అవార్డు లభించింది. ఆసియాలో ఎనిమిది దేశాలు 266 ఎంట్రీలు పంపగా... ఈ యాప్‌కు అవార్డు దక్కింది. గత జూలైలో ఎం.బిలియంత్ పేరిట మరో అంతర్జాతీయ అవార్డు లభించింది.
‘హాక్ ఐ’ తో నేరాలు తగ్గుముఖం
సాక్షి, విశాఖపట్నం: ‘హ్యాక్ ఐ’ యాప్ విని యోగంతో హైదరాబాద్‌లో నేరాలు తగ్గుము ఖం పట్టాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మీడియాకు తెలి పారు. ఈ యాప్‌తో వస్తున్న సత్ఫలితాలకు గుర్తింపుగా కేంద్రం నుంచి ఈ–గవర్నెన్స్ అవార్డు లభించిందన్నారు. హైదరాబాద్‌లో పని చేసే ప్రతీ పోలీసుకు ఇదొక మంచి గుర్తింపుగా ఆయన అభివర్ణించారు. ఈ యాప్ వినియోగంతో గతేడాది హైదరాబా ద్‌లో 30% సీరియస్ నేరాలు, 66% చైన్ స్నాచింగ్‌లు, 50% ప్రాపర్టీ నేరాలు తగ్గుము ఖం పట్టాయన్నారు. అత్యవసర సమయాల్లో ఈ యాప్ నుంచి ఎస్‌వోఎస్ పద్ధతిలో సమాచారమిస్తే క్షణాల్లో పోలీసుల వ్యవస్థ స్పందించేలా చర్యలు తీసుకున్నా మన్నారు. రెండేళ్లుగా దాదాపు 3.5 లక్షల మంది ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసు కొన్నారన్నారు.