బాబూ.. ఎందుకీ కడుపు మంట?: నాయిని | nayini narsimha reddy fired on ap cm chandra babu | Sakshi

బాబూ.. ఎందుకీ కడుపు మంట?: నాయిని

Published Fri, Jun 3 2016 3:38 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

బాబూ.. ఎందుకీ కడుపు మంట?: నాయిని - Sakshi

బాబూ.. ఎందుకీ కడుపు మంట?: నాయిని

‘స్వరాష్ట్రంలో మా భూములను సస్యశ్యామలం చేసుకోవటానికి ప్రాజెక్టులు కడుతుంటే ఆంధ్రా సీఎం చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

సాక్షి, హైదరాబాద్: ‘స్వరాష్ట్రంలో మా భూములను సస్యశ్యామలం చేసుకోవటానికి ప్రాజెక్టులు కడుతుంటే ఆంధ్రా సీఎం చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మాపై ఆయనకు ఎందుకీ కడుపు మంట’ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రశ్నించారు. విశిష్ట సేవలందించిన 23 మందికి జిల్లాస్థాయి ఉత్తమ అవార్డులను రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా గురువారం నాంపల్లి ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో అందజేశారు.

ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ తెలంగాణ పోరాటమే నీళ్లు, నిధుల కోసం జరిగిన విషయాన్ని మరచిపోవద్దన్నారు. ఇక్కడ ఉన్న ఆంధ్రోళ్లంతా తెలంగాణవాళ్లేనని, తమ పొట్టగొట్టటానికి వచ్చినవారే తమకు శత్రువులని స్పష్టం చేశారు. గతంలో తమ నిధులన్నింటిని ఆంధ్రా పాలకులు దారి మళ్లించారని, కానీ, స్వరాష్ట్రంలో కోట్లాది రూపాయలతో పలు పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులు, ఉద్యోగులపై ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement