రోడ్ల నిర్వహణ ప్రైవేటుకు వద్దు: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోడ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించొద్దని ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు అవసరమైతే చట్టాల్లో మా ర్పులు తెస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొనడాన్ని ఖండించింది. రోడ్ల నిర్వహణలో అనుభవమున్న పీడబ్ల్యూడీ, ఆర్ అండ్‌బీ ఇంజనీర్లు, నిపుణులు ఉండగా ప్రైవేటు సంస్థలపై ఆధారపడటం రాష్ట్రానికి నష్టమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అసమగ్ర అభివృద్ధికి దారితీసిన పాతికేళ్ల ప్రైవేటీకరణ విధానాలనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుపరిస్తే బహుళజాతి కంపెనీలకు రాష్ర్ట సంపదను దోచిపెట్టడమే అవుతుందన్నారు. అందువల్ల ప్రమాదకరమైన ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజలపై పడబోయే భారాలను దృష్టిలో పెట్టుకుని రాజధా ని రోడ ్ల నిర్మాణంలో ప్రైవేటు ఏజెన్సీల భాగస్వామ్యాన్ని ఇంజనీర్లు, ఉద్యోగులు వ్యతిరేకించాలన్నారు.