- ఇబ్రహీంపట్నం డెయిరీలో 4 గంటలపాటు తనిఖీ చేసిన అధికారులు
- రికార్డుల పరిశీలన.. ఉత్పత్తుల నమూనాల సేకరణ
- ల్యాబ్ నుంచి నివేదికలు వచ్చాక చర్యలు: ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: నాసిరకం పొడి తో పాలు తయారు చేస్తున్న తీరుపై యంత్రాంగం అప్రమత్తమైంది. ‘పాలకూట విషం’ శీర్షికతో గురు వారం సాక్షిలో ప్రచురితమైన కథ నంతో స్పందించిన ఆహార నాణ్యత పరిశీలన అధికారులు, పోలీసులు.. ఇబ్రహీంపట్నం డెయిరీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డెయిరీ నిర్వహణ, వినియో గిస్తున్న పదార్థాలు, ఉత్పత్తులను క్షుణ్నంగా పరిశీలించారు.
సదరు డెయిరీ నుంచి ఏయే పేర్లతో పాల ప్యాకెట్లు మార్కెట్లోకి వెళ్తున్నా యనే అంశంపై అక్కడున్న సిబ్బం దితో ఆరా తీశారు. దాదాపు నాలుగు గంటలపాటు పరిశీలన చేసిన అధికా రులు పాలు, పెరుగు తదితర ఉత్ప త్తుల నమూనాలను సేకరించారు. వీటి నాణ్యతకు సంబంధించి స్పష్టత కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపి స్తున్నట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలి పారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఈ తనిఖీల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ శంకర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘పాలకూట విషం’పై స్పందించిన యంత్రాంగం
Published Sun, Jun 25 2017 1:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement