వెంకయ్య నాయుడు
హైదరాబాద్: గత పదేళ్లుగా యూపీఏ హయాంలో లక్షా 60వేల మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని, అప్పుడు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిసాన్ యాత్ర, పాదయాత్రలు ఎందుకు చేయలేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. పంట నష్టపరిహారాన్ని పెంచినా కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోందని విమర్శించారు.
ప్రకృతివైపరీత్యాలు సంభవించి, ప్రజలు కష్టాలుపడుతున్న సమయంలో రాహుల్ ఎక్కడ ఉన్నారని అడిగారు. తమ ఏడాది పాలనపై మే 26 నుంచి ప్రజలలోకి వెళ్లనున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.