సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇకమీదట ఇల్లు, స్థలం కొనుగోలు మరింత ప్రియం కానుంది. పేదలు, మధ్యతరగతికి సొంతిల్లు కలగానే మిగలనుంది. స్థిరాస్తి మార్కెట్(రిజిస్ట్రేషన్) విలువలు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపాలక సంస్థల పరిధిలో మార్కెట్ విలువల పెంపునకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. దీంతో వచ్చేనెల 1 నుంచి భూములు, స్థలాలు, కట్టడాల రిజిస్ట్రేషన్ విలువలు భారీగా పెరగనున్నాయి.