నేటి నుంచి పాలిసెట్ వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నేటి (సోమవారం) నుంచి విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫి కేషన్‌కు హాజరై, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సాంకేతిక విద్యా కమిషనర్ వాణి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 181 కాలేజీల్లో 43,082 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నేడు 1 నుంచి 10 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన వారు సోమవారం నుంచే 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చ న్నారు. వెరిఫికేషన్ సమయంలో విద్యార్థులు ఆధార్, బయోమెట్రిక్ వివరాలను ఇవ్వాలని సూచించారు. ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, ఆధార్, పదో తరగతి ధ్రువీకరణ పత్రాలు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫి కెట్లు, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చు కోవాలని పేర్కొ న్నారు. పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్ https:// tspolycet. nic.inలో పొందవచ్చని తెలిపారు.
ఇదీ షెడ్యూలు..
మే 29 నుంచి జూన్ 6 వరకు వెరిఫికేషన్
మే 29 నుంచి జూన్ 7 వరకు వెబ్ ఆప్షన్లు
జూన్ 8: ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం
జూన్ 10: సీట్లు కేటాయింపు
జూన్ 14లోపు: కాలేజీల్లో చేరికలు
జూన్ 14: తరగతుల ప్రారంభం