హైదరాబాద్: తీగ లాగితే డొంక కదిలినట్లు అంతర్రాష్ట్ర రవాణ పన్ను చెల్లించకుండా అక్రమంగా తెలంగాణలోకి ప్రవేశించి.. పట్టుబడ్డ ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి శుక్రవారం హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌కు ఓ లారీ వచ్చింది. మార్గమధ్యలో అంతర్రాష్ట్రాల వాహనాల పన్నును చెల్లించకుండా తప్పించుకున్న ఆ వాహనాన్ని ఎస్‌ఓటీ పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. తీరా ఆ లారీని పరిశీలించగా దాదాపు 14 టన్నుల రేషన్ బియ్యం బయటపడ్డాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి అప్పగించారు.
'పన్ను' లాగితే బియ్యం బయటపడ్డాయ్!
Published Fri, Jul 24 2015 8:35 PM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement
Advertisement