ఇది క్లిక్ అయితే..! | Preparations for the digital base map | Sakshi
Sakshi News home page

ఇది క్లిక్ అయితే..!

Published Fri, Jul 17 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

ఇది క్లిక్  అయితే..!

ఇది క్లిక్ అయితే..!

డిజిటల్ బేస్ మ్యాపులకు సన్నాహాలు
ఇక సులువుగా  పైపులైన్ల సమాచారం
జలమండలి ప్రయోగం

 
సిటీబ్యూరో: మహా నగర పరిధిలోని మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలకు సంబంధించిన పైప్‌లైన్లపై సమగ్ర సమాచారాన్ని ఇకపై ఒక్క క్లిక్‌తో పొందవచ్చు.దీని కోసం జలమండలి డిజిటల్ బేస్ మ్యాపుల తయారీకి సన్నాహాలు చేస్తోంది. బోర్డులోని సెంట్రల్ డిజైన్ సెల్ ఆధ్వర్యంలో జరిగే ఈ కసరత్తులో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థ సహకారంతో రూపొందిం చిన జీఐఎస్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయనున్నారు. ప్రాథమికంగా బోర్డు పరిధిలోని 16 నిర్వహణ డివిజన్ల పరిధులను సూచించే శాటిలైట్ చిత్రాలను వినియోగిస్తారు. ఇందులో కేవలం ప్రాంతం వివరాలు మాత్రమే కనిపిస్తాయి. వీటిని మరింత అభివృద్ధి చేసి రహదారులు, సీవరేజిై లెన్లు, మంచినీటి లైన్లు, ఎత్తయిన భవనాలు, అపార్ట్‌మెంట్లు, చారిత్రక కట్టడాలు స్పష్టంగా కనిపిచేలా వేర్వేరుగా మ్యాపులను తయారు చేయూల్సి ఉంది. ఇక డివిజన్ పరిధిలో ప్రతి ఇంటి వివరాలను మ్యాపులో పొందుపరిచేలా చూస్తారు. దీంతో సాధారణంగా కాగితంపై ఉన్న వివరాల్లో దొరకని అతిసూక్ష్మ సమాచారం సైతం మ్యాపులో ప్రత్యక్షమవుతుంది. ఉదాహరణకు గాంధీనగర్ రోడ్డు నెంబరు 12లో ప్లాట్ నెం.22లో ఉన్న భవనం ఎన్ని అంతస్తులు ఉంది.

అందులో ఎంతమంది నివాసం ఉంటున్నారు. దానికి ఎన్ని నల్లా, సీవరేజి కనెక్షన్లు ఉన్నాయన్న సమాచారాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు. కంప్యూటర్ తెరపై కనిపించే మ్యాపును ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ప్రతి ఇంటి సమాచారం ప్రత్యక్షమవుతుంది. నెలవారీ నీటి బిల్లులు జారీచేసే మీటర్ రీడర్లు ఈ వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఒక వీధిలో డాకెట్ల వారీగా (ప్రధాన పైప్‌లైన్‌కు అనుసంధానమైనవి) ఉన్న కనెక్షన్ల వివరాలు వెంటనే కనుక్కోవచ్చు. మరోవైపు బహుళ అంతస్తుల్లో ఉన్న నల్లాల వివరాలు, రోజువారీ ఎంత నీటిని వియోగిస్తున్నారో తెలుసుకొని డేటాబేస్‌లో పొందుపరచవచ్చు. దీని ద్వారా బిల్లుల జారీని కట్టుదిట్టం చేసి తద్వారా బోర్డు రెవెన్యూ ఆదాయూన్ని గణనీయుంగా పెంచుకునే వీలుంటుంది.

ఉపయోగాలివీ..
జీఐఎస్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ బేస్ మ్యాపులు సిద్ధమైతే డాకెట్ల వారీగా అక్రమ నల్లాల భరతం పట్టవచ్చు.కలుషిత జలాల సమస్య తరచూ ఉత్పన్నమయ్యే ప్రాంతాలను గుర్తించి. పైప్‌లైన్లను మార్చవచ్చు .తరచూ మంచినీటి లీకేజీలు ఏర్పడుతున్న పైప్‌లైన్లను గుర్తించవచ్చు. మూతలు లేని మ్యాన్‌హోళ్లు, దెబ్బతిన్న మురుగు నీటి పైప్‌లైన్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలిసేలా చేయవచ్చు.మహా నగర పరిధిలోని నల్లా కనెక్షన్ల వారీగా నీటి వినియోగం, వారు చెల్లిస్తున్న బిల్లుల వివరాలను ఒక్క క్లిక్‌తో తెలుసుకోవచ్చు.శరవేగంగా విస్తరిస్తున్న శివారు కాలనీల్లో మంచినీటి నెట్‌వర్క్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయవచ్చు.{పధాన మంచినీటి పైప్‌లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు, పంపిణీ పైప్‌లైన్లను వేర్వేరుగా గుర్తించి, పరిరక్షణకు చర్యలు తీసుకోవచ్చు. దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయవచ్చు.

మంచినీటి సరఫరా నష్టాలు, చౌర్యం తదితరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న 40 శాతం సరఫరా నష్టాలను 20 శాతానికి కుదించవచ్చుమురుగు నీటి పైప్‌లైన్లలో పేరుకుపోయిన వ్యర్థాలను, డీసిల్టింగ్ పనులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించవచ్చు. మంచినీటి సరఫరా వీలుకానివి, అత్యంత ఎత్తయినవి, చివరన ఉన్న ప్రాంతాలను గుర్తించవచ్చు. మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థల్లో ఉన్న పైప్‌లైన్లను వాటి పరిమాణం ఆధారంగా తేలికగా గుర్తించవచ్చు. ఈ డేటాను ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలోని సర్వర్‌లో నిక్షిప్తం చేయవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement