హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై టీడీపీ నేత రాజామాస్టర్ బుధవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. టీడీపీపై విమర్శులు చేస్తే ఊరుకోమని వీర్రాజుకు రాజామాస్టర్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం గతంలో ఇచ్చిన హామీ కోసం పాటుపడాలని ఆయన వీర్రాజుకు సూచించారు. అలాగే ఉత్తరకుమార్ ప్రగల్బాలు మానుకోవాలంటూ సోము వీర్రాజుకు రాజామాస్టర్ హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నీమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మిత్రపక్షమైన టీడీపీ అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎన్ని కోట్లు కేటాయించిందో చెప్పకుండా ఒక్క ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు మాట్లాడుతుండటంతో సోము వీర్రాజు వారిపై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.