ప్రముఖ సాహితీవేత్త, భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు రాళ్లబండి కవితా ప్రసాద్ (ఆర్. ప్రసాదరాజు) గురువారం గుండెపోటుకు గురయ్యారు.
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త, భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు రాళ్లబండి కవితా ప్రసాద్ (ఆర్. ప్రసాదరాజు) గురువారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న రాళ్లబండి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. విషయం తెలిసి పలువురు ప్రముఖుల ఆసుపత్రికి వచ్చి రాళ్లబండి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.