ఇక నుంచి ఈ-చలాన్లతోనే రిజిస్ట్రేషన్ చెల్లింపులు | Registration payments by E-challans | Sakshi
Sakshi News home page

ఇక నుంచి ఈ-చలాన్లతోనే రిజిస్ట్రేషన్ చెల్లింపులు

Published Fri, Apr 1 2016 8:11 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

Registration payments by E-challans

హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను ఇకపై ఈ-చలాన్ల ద్వారానే చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రకాల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం సొమ్ము చెల్లింపులో వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అవకతవకలను నివారించేందుకు ఈ ప్రక్రియను రూపొందించారు. ఈ-చలాన్ల ప్రక్రియ అమలు కోసం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది.

ఏప్రిల్ 15న ఈ-చలాన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ-చలాన్ల ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్లందరికీ దశలవారీగా శిక్షణ ఇస్తున్నామని, తొలిదశలో హైదరాబాద్‌లో శిక్షణ పొందిన సబ్ రిజిస్ట్రార్లు, ఆయా జిల్లాల్లో మిగిలిన సబ్‌రిజిస్ట్రార్లకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement