రోహిత్ ఓ మేధావి: పవన్ కల్యాణ్ | rohith suicide makes me hurt: pawan kalyan | Sakshi
Sakshi News home page

రోహిత్ ఓ మేధావి: పవన్ కల్యాణ్

Published Mon, Feb 1 2016 4:40 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

rohith suicide makes me hurt: pawan kalyan

హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య తనకు బాధను కలిగించిందని ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అతడు దళితుడా మరింకేదైనా కులానికి చెందినవాడా అని కాకుండా ఓ మంచి మేధావి కుల వివక్షకారణంగా చనిపోయాడని చెప్పారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష ఉందని చెప్పారు. ప్రొఫెసర్లే స్వయంగా కుల విహార యాత్రలకు తీసుకెళుతుంటారని, చిన్ననాటి నుంచే తాను ఇలాంటివి చూస్తున్నానని చెప్పారు. |

రోహిత్ ఆత్మహత్య విషయాన్ని అన్ని పార్టీల నేతలు ఆయా స్థాయిల్లోకి తీసుకెళుతున్నారని, అందుకే, తాను ఆ రాజకీయ నాయకుల్లో కలిసిపోవాలనుకోవడం లేదని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రశ్నించగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నందున తాను ఏ విధంగా స్పందిచబోనని చెప్పారు. తునిలో జరిగిన కాపు గర్జన హింసాత్మకంగా మారడంపై పవన్ కల్యాణ్ సోమవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement