సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు అందజేసేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల పరిధిలోని రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.1,290 కోట్లను మంజూరు చేయనుందని రోడ్లు, భ వనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో కేంద్ర గ్రామీణ, పంచాయతీరాజ్, తాగునీటి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ను కలసి రాష్ట్రం తరపున మరోసారి ప్రతిపాదనలు అందజేశామని పేర్కొన్నారు. గత జూన్ నెలలో పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ఓ స్పష్టతకు వచ్చిందని, తాజా ప్రతిపాదనలకు ఆ శాఖ మంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ తనకు లేఖ రాశారని ఆయన వెల్లడించారు. నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం 24 రోడ్డు పనులుంటాయని, ఇందులో రెండు వంతెనలను కూడా నిర్మించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రతిపాదిత పనులివే...
►ఆదిలాబాద్ జిల్లా- నాలుగు పనులు- 87 కిలోమీటర్ల నిడివి-అంచనా రూ.250 కోట్లు. హా కరీంనగర్ జిల్లా- ఐదు పనులు- 102 కిలోమీటర్లు - రూ.265కోట్లు అంచనా. హా వరంగల్ జిల్లా-ఐదు పనులు- 139.97 కిలోమీటర్లు - రూ.315 కోట్ల అంచనా.
► ఖమ్మం జిల్లా- 12 పనులు- 207.90 కిలోమీటర్లు -రూ.460 కోట్లు అంచనా.
తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్లకు రూ.1,290 కోట్లు
Published Thu, Sep 22 2016 3:08 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement