ఆ రెండింటి కోసమే హైదరాబాద్: సచిన్ | Sachin Tendulkar likes Hyderabadi Briyani | Sakshi
Sakshi News home page

ఆ రెండింటి కోసమే హైదరాబాద్: సచిన్

Published Thu, May 19 2016 7:01 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

ఆ రెండింటి కోసమే హైదరాబాద్: సచిన్ - Sakshi

ఆ రెండింటి కోసమే హైదరాబాద్: సచిన్

హైదరాబాద్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. తాను హైదరాబాద్‌కు వచ్చానంటే ఒకటి క్రికెట్‌ కోసం,  రెండు బిర్యానీ కోసం అని సచిన్ తెలిపాడు. హైదరాబాద్ వస్తే బిర్యానీ తినకుండా వెళ్లనని చెప్పాడు. కాగా  దేశీ టెక్నాలజీ సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీ స్మాట్రాన్‌  కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సచిన్‌ వ్యవహరిస్తున్న అతడు గురువారం హైదరాబాద్ విచ్చేశాడు. 

భారత్‌ స్కిల్‌ ఇండియాకు కూడా ప్రచార కర్తగా ఉన్న సచిన్ ఈ సందర్భంగా  మాట్లాడుతూ భారత్ను సెల్ ఫోన్‌ తయారీ హబ్‌గా మార్చాలని, మేకిన్‌ ఇండియ ప్రోత్సహించడం ద్వారా ఉపాధి పెరగడమే కాకుండా ఆర్థిక వృద్ధి చెందుతుందని ఆకాంక్షించాడు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతరత్న సచిన్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు.  వీరిద్దరూ కలిసి సరదాగా ఓ సెల్ఫీ దిగారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement