
సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో అగ్ని ప్రమాదం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.25లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ పక్కన ఉన్న బూత్‌బంగళా ఆవరణలో పవన్ కల్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ సెట్ వేశారు. అయితే ఈ సెట్‌ను ఇంత వరకు తొలగించలేదు.
మండుతున్న ఎండలకు షార్ట్‌సర్యూట్‌తో శనివారం మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే సెట్‌ను చుట్టుముట్టాయి. ఫిలింనగర్, సనత్‌నగర్ ఫైర్‌స్టేషన్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. తీవ్రంగా ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.