సిటీబ్యూరో: అఫ్ఘనిస్తాన్‌లో ఆల్‌ఖైదా ఉగ్రవాద సం స్థలో శిక్షణ పొందేం దుకు వెళ్లే క్రమంలో నగరానికి వచ్చి పోలీసులకు పట్టుబడిన సిమి ఉగ్రవాదులు సాముదసిర్ అలియాస్ తల్హా (25), షోయబ్ అహ్మద్ ఖాన్ (24)లకు బుధవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల విలువ గల రెండు షూరిటీలు సమర్చించాలని కోర్టు ఆదేశించింది. షూరిటీ ఇచ్చే వ్యక్తులు హైదరాబాద్‌కు చెందిన వారై ఉండి వారిపై ఎలాంటి కేసులు, నేరచరిత్ర ఉండకూడదని సూచించింది.
గురువారం నిందితుల తరపున షూరిటీలు సమర్పిస్తే చంచల్‌గూడ జైలులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు డుదలవుతారు. కాగా నిందితులను అరెస్టు చేసి సకాలంలో చార్జిషీటు వేయడంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) అధికారులు విఫలం కావడం వల్లనే ఉగ్రవాదులిద్దరూ జైలు నుంచి విడుదల కావడానికి మార్గం ఏర్పడిందనే విమర్శలున్నాయి. తీవ్రమైన ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన వ్యక్తుల అరెస్టు, చార్జిషీట్ విషయంలో పోలీసులు మరింత శ్రద్ధకనబర్చి ఉండాల్సిందని అంటున్నారు.
సిమి ఉగ్రవాదులకు బెయిల్ మంజూరు
Published Thu, Jan 29 2015 12:27 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
Advertisement