ఐఎస్‌ఐఎస్ వెనుక గురుశిష్యులు! | some students are supports to ISIS along with UP Professor | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఐఎస్ వెనుక గురుశిష్యులు!

Published Sun, Nov 2 2014 12:45 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

some students are supports to ISIS along with UP Professor

దక్షిణాదిలో ‘ఉగ్ర’సంస్థ విస్తరణలో యూపీ ప్రొఫెసర్   
అతడికి సహకరిస్తున్న ఇద్దరు విద్యార్థులు


సాక్షి, హైదరాబాద్: దక్షిణాదిలో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల వెనుక ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రొఫెసర్, ఢిల్లీ, అసోంలకు చెందిన అతని ఇద్దరు శిష్యుల హస్తం ఉందని జాతీయ  దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ), కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలకు సమాచారం అందింది. దీంతో వారి ఆచూకీ కోసం రెండు సంస్థల అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఐఎస్‌ఐఎస్ భావజాలానికి ఆకర్షితులై 42 మంది ఇరాక్ వెళ్లేందుకు సిద్ధమైన  విషయం తెలిసిందే.

ఇందులో ఓ వైద్యవిద్యార్థిని కూడా ఉన్నట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. వీరందరు ఇరాక్ వెళ్లేందుకు పాస్‌పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారని నిఘా వర్గాల దృష్టికి వచ్చింది. కాగా, వీళ్లకు ఐఎస్‌ఐఎస్ సంస్థ సమాచారాన్ని, ఇరాక్, సిరియాలలో ఉగ్రవాదులు తాజా చర్యలను  యూపీ ప్రొఫెసర్, అతడి ఇద్దరు శిష్యులే అందజేస్తున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్‌ను అదపులోకి తీసుకోడానికి ఎన్‌ఐఎ, ఐబీ అధికారులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా వీరు కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నారని నిఘా వర్గాలు కనుగొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement