కేటీఆర్ కు రూ.31.20కోట్ల చెక్ అందించిన వెంకయ్య | swachh gruha program held at hitech cyber city conventions center | Sakshi
Sakshi News home page

కేటీఆర్ కు రూ.31.20కోట్ల చెక్ అందించిన వెంకయ్య

Published Sun, Oct 9 2016 11:46 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

కేటీఆర్ కు రూ.31.20కోట్ల చెక్ అందించిన వెంకయ్య

కేటీఆర్ కు రూ.31.20కోట్ల చెక్ అందించిన వెంకయ్య

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్.. ఏదో రాజకీయ కార్యక్రమంలా కాకుండా ప్రజా ఉద్యమంలా మారిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని హెటెక్స్ లో ఆదివారం ఉదయం ఏర్పాటుచేసిన స్వచ్ఛ గృహ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. స్వచ్ఛ్ భారత్ ఇంకాస్త ప్రజల్లోకి వెళ్లాలంటే సినిమాతోనే సాధ్యం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాల కొనసాగింపునకుగానూ  రూ.31.20 కోట్ల చెక్కును రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావుకు వెంకయ్య అందజేశారు.

'ఈ బృహత్తర కార్యక్రమానికి వచ్చేటప్పుడే.. ఉత్తచేతులతో వెళితే బాగుండదని అనుకున్నా. అందుకే అప్పటికప్పుడు శాఖలను పురమాయించి రూ.31.20 కోట్ల చెక్కును సిద్ధం చేయించా'అని కేటీఆర్ కు చెక్ అందిస్తూ వెంకయ్య వ్యాఖ్యానించారు. స్వచ్ఛ్ భారత్ ప్రచారం కోసం రూపొందిచిన 4500 లఘు చిత్రాల్లో 17 చిత్రాలను ఎంపికచేసి, ఆయా దర్శకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సినీ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement